![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1005 లో.. శైలెంద్రని దేవయాని బెల్ట్ తో కొడుతుంటే అప్పుడే అక్కడికి ధరణి వస్తుంది. అసలు నువ్వు ఎవరు నా భర్తని కొట్టడానికి అని ధరణి వచ్చి కోపంగా బెల్ట్ తీసుకొని దేవయానిని కొట్టబోతుంటే.. నన్నే కొడతావా అని దేవయాని ఆపుతుంది.
మరి నా భర్తని ఎందుకు కొడుతున్నావని ధరణి అడుగుతుంది. నేనే ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక కొట్టమని చెప్పానని శైలంద్ర చెప్తాడు. నువ్వు వెన్నెపూస తెచ్చి తనకి రాయి అని ధరణికి దేవయాని చెప్తుంది. ధరణి వెళ్ళాక.. దీనికి ఎంత దైర్యం నన్నే కొట్టాలనుకుంటుంది. ఆకులా ఉండేది మేకులా తయారు అయిందని దేవయాని అంటుంది. ఆ తర్వాత కాలేజీలో జరిగింది మొత్తం దేవయానికి శైలేంద్ర చెప్తాడు.
ఆ తర్వాత మను దగ్గరికి మహేంద్ర వచ్చి.. క్యాబిన్ కంఫర్ట్ గా ఉందా అని అడుగుతాడు. నిన్ను ఒక విషయం అడగలంటు.. అసలు నీకు అనుపమకి గల సంబంధమేంటని మనుని మహేంద్ర అడుగుతాడు. నీకు తనకి గతం ఉందని అనుకుంటున్నానని మహేంద్ర అనగానే.. అదే విషయం తనని అడగలేకపోయారా అని మను అంటాడు. అడిగాను తనేం సమాధానం చెప్పలేదని మహేంద్ర అంటాడు. సమాధానం చెప్పలేదంటే ఏం లేదనే అర్థం కదా అని మను అంటాడు. నువ్వు ఎదో దాస్తున్నావని నాకు అర్థం అవుతుందని మహేంద్ర అనుకుంటాడు. నువ్వు రేపు మా ఇంటికి భోజనానికి రావాలి.. నేను నీకు లొకేషన్ పంపిస్తానని మహేంద్ర అనగానే.. సరేనని మను అంటాడు. మరొకవైపు ఈ మను ఏంటి ఇలా చేస్తున్నాడు మంచిగా నటిస్తునే ఇలా చేస్తున్నాడు. ఇలా భద్ర కూడా కాపాడినట్లే చేసి దొంగ దెబ్బ తీసాడు. అసలు ఎవరిని నమ్మొద్దని వసుధార అనుకుంటుంది.
ఆ తర్వాత శైలంద్రకి తగిలిన దెబ్బలకి వెన్నె రాస్తుంది ధరణి. అసలే నొప్పితో ఉన్న శైలెంద్రకి ధరణి మాటలు ఇంకా మంటగా ఉంటాయి.. శైలెంద్ర చెయ్యి పట్టుకొని.. రిషి వచ్చి మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడతాడు. అసలు మీకు ఎండీ పదవి దక్కదని ధరణి అంటుంటే శైలంద్ర బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ నొప్పి కంటే నీ మాటలే నొప్పిగా ఉన్నాయని శైలెంద్ర అంటాడు. ఆ తర్వాత అనుపమ తన పెద్దమ్మకి ఫోన్ చేసి.. మను కాలేజీ లో బోర్డు మెంబర్ అయ్యాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు. అసలు ఇంట్లో ఉన్నాడా అని అడగుతుంది. ఎవరో భోజనానికి పిలిచారంట.. వెళ్తున్నాడని అనగానే వాణ్ణి ఎవరు పిలుస్తారని అనుపమ అంటుంది. ఆ తర్వాత రాజీవ్ ని శైలేంద్ర కలిసి వసుధారని దక్కించుకునే ప్రయత్నం నువ్వే చేసుకో అప్పుడే సులువుగా అవుతుందని శైలంద్ర అనగానే.. అంటే నా పని నన్ను చూసుకోమని చెప్తున్నావా అని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |